పాక్‌కు సాయం నిలిపేస్తాం: ఆస్ట్రేలియా

Wed,December 4, 2019 02:08 AM

మెల్‌బోర్న్‌: పాకిస్థాన్‌కు అందించే అన్ని రకాల ద్వైపాక్షిక సాయాన్ని నిలిపివేయనున్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది. ‘2018-19లో పాకిస్థాన్‌కు సహాయ కార్యక్రమం పురోగతి’ అనే పేరుతో ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగం నివేదిక ఈ మేరకు పేర్కొన్నది. 2019-20లో పాక్‌కు అందించే సాయాన్ని1.9 కోట్ల ఆస్ట్రేలియా డాలర్లకు కుదించామని, 2020-21 నుంచి పూర్తిగా నిలిపివేస్తామని తెలిపింది. పాకిస్థాన్‌లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, ఈఏడాది ఫిబ్రవరి నుంచి పాక్‌-భారత్‌ మధ్యఉద్రిక్తతలు పెరిగాయని ఆందోళన వ్యక్తంచేసింది.

1419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles