నక్షత్రాన్ని మింగిన కృష్ణబిలం

Mon,June 18, 2018 06:36 AM

Astronomers spot supermassive blackhole destroying a star

-మెరుపువేగంతో తనలో కలిపేసుకున్న బ్లాక్‌హోల్
లండన్, జూన్ 17: ఒక కృష్ణబిలం నక్షత్రాన్ని తనలో కలిపేసుకోవడాన్ని శాస్త్రవేత్తలు మొదటిసారిగా ప్రతక్ష్యంగా గమనించారు. సాధారణంగా ఇందుకు శతాబ్దాల సమయం పడుతుంది. కానీ మొదటిసారిగా విధ్వంస చర్యలన్నీ వేగంగా సాగాయి. స్పెయిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు రేడియో, ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోపులు, నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన వెరీ లాంగ్ బేస్‌లైన్ ఆర్రే (వీఎల్‌బీఏ) సహాయంతో భూమికి 15 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఏఆర్‌పీ-299 అనే గెలాక్సీల సముదాయాన్ని పరిశీలించారు. ఇందులోని కేంద్ర స్థానంలో ఒక పెద్ద బ్లాక్‌హోల్ ఉన్నట్టు గుర్తించారు. ఇది సూర్యుడి కన్నా పరిమాణంలో దాదాపు రెండు కోట్ల రెట్లు పెద్దగా ఉన్నది. ఈ బ్లాక్‌హోల్ దానికి సమీపంలో ఉన్న సూర్యుడి కన్నా రెండు రెట్ల బరువున్న ఓ నక్షత్రాన్ని ధ్వంసం చేసి తనలో కలిపేసుకున్నది.

ఇదంతా కాంతి వేగంతో జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటివి చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయన్నారు. ధ్వంసమైన నక్షత్రం నుంచి వెలువడిన పదార్థాలు కృష్ణబిలం చుట్టూ ఒక పొరలా పేరుకుపోయాయి. ఎక్స్-రే కిరణాలు విశ్వంలోకి వెళ్లిపోయాయి. ఏఆర్‌పీ-299 గెలాక్సీల సముదాయంలో ఓ బ్లాక్‌హోల్ నక్షత్రానికి దగ్గరగా వస్తున్నట్టు మొదటిసారిగా 2005 జనవరి 30న శాస్త్రవేత్తలకు సమాచారం వచ్చింది. వీఎల్‌బీఏ సాయంతో పరిశీలించగా నిజమేనని తేలింది. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ఎక్స్-రే కిరణాలు, కాంతి మాత్రమే విడుదలవుతున్నాయి.

897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles