భూమికి తప్పిన పెను ప్రమాదం

Thu,October 12, 2017 11:50 AM

Asteroid 2012 TC4 to pass damn close to Earth tomorrow testing our space defences

నేడు అత్యంత సమీపం నుంచి దూసుకెళ్లనున్న గ్రహశకలం
asteriodearth
వాషింగ్టన్, అక్టోబర్ 11: భూమికి ఓ పెద్ద ప్రమాదం తప్పింది. మన గ్రహాన్ని ఢీకొనే అవకాశమున్న ఓ గ్రహశకలం తన దిశను మార్చుకొని అత్యంత సమీపం నుంచి దూసుకెళ్లనున్నది. ఇది గురువారం ఉదయం 11:12 గంటలకు అంటార్కిటికా సమీపం నుంచి భూమిని దాటుకొని వెళ్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 15-30 మీటర్ల వ్యాసార్ధంతో ఉన్న 2012 టీసీ4 అని పిలిచే గ్రహశకలం దాని వేగం, దిశను బట్టి 2017లో భూమిని ఢీకొట్టే అవకాశాలున్నాయని హవాయి దీవుల్లోని పనోరమిక్ సర్వే టెలిస్కోప్ ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టం 2012లో అంచనా వేసింది. ఈ ఏడాది జూలై నుంచి శాస్త్రవేత్తలు గ్రహశకల గమనాన్ని అనుక్షణం గమనిస్తున్నారు. టీసీ-4 క్రమంగా తన మార్గాన్ని మార్చుకున్నదని, భూమికి 42వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనున్నదని వారు ప్రకటించారు. మరో వందేండ్లలో మరే గ్రహశకలం భూమి సమీపంలో రాబోదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

3937

More News

VIRAL NEWS

Featured Articles