ఆసిమ్‌ ఉమర్‌ హతం

Thu,October 10, 2019 02:24 AM

ఇస్లామాబాద్‌: అల్‌ఖైదా ఉగ్రసంస్థ కీలక నేత ఆసిమ్‌ ఉమర్‌ హతమయ్యాడు. భారత్‌కు చెందిన ఆసిమ్‌ అల్‌ఖైదా భారత ఉపఖండ విభాగానికి చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌లోని హెల్మాండ్‌ రాష్ట్రంలో అమెరికా-ఆఫ్ఘనిస్థాన్‌ సంకీర్ణ బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఆసిమ్‌ హతమైనట్టు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. గత నెల 23న హెల్మాండ్‌ రాష్ట్రంలోని ముసా కాలా జిల్లాలో ఉన్న అల్‌ఖైదా స్థావరంపై జరిపిన దాడిలో ఆసిమ్‌తోపాటు మరో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్టు ఆఫ్ఘనిస్థాన్‌ రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

1567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles