భూమి లాంటి మరో గ్రహం!


Fri,April 21, 2017 01:35 AM

discovered-rocky
లండన్: గ్రహాంతర జీవుల అన్వేషణలో మరో ముందంజపడింది. మనకు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఒక మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భూమిలాంటి గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంట్లో జీవం ఉనికికి అవకాశాలు అధికంగా ఉన్నాయని భావిస్తున్నారు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన హార్స్ టెలిస్కోప్‌తోపాటు వివిధ దేశాల్లో ఉన్న టెలిస్కోపులను ఉపయోగించి అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం సౌరకుటుంబం అవతల ఉన్న cన్ని గుర్తించింది. ఇది పరిమాణంలో భూమికన్నా కొద్దిగా పెద్దగా ఉన్నప్పటికీ, ద్రవ్యరాశి పరంగా భూమికన్నా ఏడు రెట్లు బరువైనదని లెక్కగట్టారు. ఈ గ్రహం సాంద్రత కూడా ఎక్కువగానే ఉంటుందని, రాతితో, ఇనుప ఖనిజంతో గ్రహం రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. సూర్యుడి నుంచి భూమి ఉన్నదూరానికి పదిరెట్లు దగ్గరగా ఈ గ్రహం తన మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నది. అయితే, ఆ నక్షత్రం నుంచి వస్తున్న కాంతి.. భూమిపై పడే సూర్యకాంతిలో సగం మాత్రమే ఉన్నందున నివాసయోగ్యం కావచ్చని అంచనా వేస్తున్నారు.

452
Tags

More News

VIRAL NEWS