ఆఫ్ఘన్ వైమానిక దాడుల్లో 21 మంది మృతి

Mon,February 11, 2019 01:01 AM

Afghan official says air raids kill 21 civilians

కాబూల్/ ఇస్లామాబాద్, ఫిబ్రవరి 10: ఆఫ్ఘనిస్థాన్‌లోని హెల్మాండ్ రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో పిల్లలు, మహిళలతోపాటు 21 మంది పౌరులు మృతి చెందారని ఎంపీ మహమ్మద్ హషిం అల్కోజాయి తెలిపారు. శుక్రవారం రాత్రి సంగిన్ జిల్లాలో నాటో సేనల సారథ్యంలో ఈ దాడులు జరిగాయన్నారు. ఈ దాడుల్లో మరో ఐదుగురు గాయపడ్డారన్నారు. వైమానిక దాడుల్లో అమాయకులు, మహిళలు, పిల్లలు బాధితులు కావడంతో సైనిక కార్యకలాపాలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతుందన్నారు. రాష్ట్ర గవర్నర్ అధికార ప్రతినిధి ఒమెర్ జవాక్ స్పందిస్తూ పౌర నివాస ప్రాంతాల నుంచి ఆఫ్ఘన్ భద్ర తా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఆరోపించారు. అయితే వైమానిక దాడుల్లో సామాన్యులు మరణించిన సంగతి నిజమేనని అంగీకరించారు. అమెరికా, ఇతర దేశాల ప్రతినిధులతోపాటు ఆఫ్ఘన్ ప్రభుత్వంతో జరుగుతున్న శాంతి చర్చలు ఇంకా ఒక ముగింపునకు రాలేదని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.

703
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles