పాఠశాలలో విద్యార్థులపై మాజీ ఉద్యోగి దాడి

Wed,January 9, 2019 12:34 AM

-20 మందికి గాయాలు.. చైనాలో ఘటన
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లోని ప్రాథమిక పాఠశాల మాజీ ఉద్యోగి ఉన్మాదిగా మారి ఆ పాఠశాల విద్యార్థులపై సుత్తితో కొట్టి దాడి చేయడంతో 20 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి సీరియస్‌గా ఉన్నదని అధికారులు మంగళవారం తెలిపారు. జీచెంగ్ జిల్లాలోని నంబర్ వన్ ప్రాథమిక పాఠశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేసిన లియాంగ్ అలియాస్ జాను ఇటీవల తొలిగించారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి.. విద్యార్థులు వ్యాయామం చేస్తున్నప్పుడు వారి తలపై సుత్తితో మోదాడు. ఈ ఘటన తెలియగానే పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. గాయపడిన విద్యార్థులను దవాఖానలో చేర్చారని సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.


ముస్లింలకూ రిజర్వేషన్లు కల్పించాలి
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది ఎలక్షన్ స్టంట్. అయినప్పటికీ స్వాగతిస్తున్నాం. ఆర్థికంగా వెనుకబాటుకు గురైన ముస్లింలకు, ఇతర మైనారిటీ వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ కూడా రాశాం. కానీ మా డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోలేదు.
-మాయావతి (బీఎస్పీ అధ్యక్షురాలు)

అగ్రకులాల పేద యువతకు బహుమతి
రిజర్వేషన్లు అనేవి అగ్రవర్ణ పేద యువతకు మోదీ సర్కార్ అందించిన బహుమతి. వారు తమ జీవితాన్ని ఉన్నతంగా చక్కదిద్దుకోవడానికి గొప్ప అవకాశం. ఈ రిజర్వేషన్ల విషయంలో ఇన్నాళ్లు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిన పార్టీలకు ఇదో గుణపాఠం.
-అమిత్ షా (బీజేపీ అధ్యక్షుడు)

502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles