అమెరికాలో కూలిన విమానం 9 మంది మృతి

Mon,December 2, 2019 12:51 AM

-మృతుల్లో ఇద్దరు చిన్నారులు
వాషింగ్టన్‌: అమెరికాలో ఘోర విమాన ప్రమా దం జరిగింది. గాలిలోకి ఎగిరిన కొద్ది సేపటికే విమానం కూలడంతో ఇద్దరు చిన్నారులు, పైలట్‌తోపాటు తొమ్మిది మంది మరణించారు. ఈ దుర్ఘటన శనివారం దక్షిణ డకోటా రాష్ట్రంలో జరిగింది. పైలట్‌తోసహా మొత్తం 12 మందితో ఛంబర్‌లైన్‌ విమానాశ్రయం నుంచి ఇడావో రాష్ట్రంలోని ఇడావో ప్రాంతీ య విమానాశ్రయానికి ‘పిలాటస్‌ పీసీ-12’ అనే విమానం బయలుదేరింది. గాలిలోకి ఎగిరిన కొద్ది సేపటికే కూలిపోయింది. కాగా, గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. అననుకూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. దక్షిణ డకోటా ప్రాంతంలో తుఫాను హెచ్చరిక ఇప్పటికే అమల్లో ఉన్నది. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తామని అధికారులు
తెలిపారు.

992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles