యెమెన్‌లో భీకర పోరు

Mon,September 10, 2018 01:49 AM

84 dead following vicious fighting in Yemen after peace talks fail

-11 మంది సైనికులు,73 మంది తిరుగుబాటుదారులు మృతి
-ఐరాస చర్చలు విఫలం కావడంతో దాడులు తీవ్రతరం

ఖోఖా: యెమెన్‌లో సౌదీఅరేబియా మద్దతు గల ప్రభుత్వ దళాలకు, హుతి తిరుగుబాటుదారులకు మధ్య ఆదివారం జరిగిన భీకరపోరులో మొత్తం 84 మంది మరణించారు. శనివారం ఐరాస శాంతి చర్చలు విఫలం కావడంతో ఇరు వర్గాలు పరస్పర దాడులను తీవ్రం చేశాయి. ఎర్రసముద్ర తీరాన గల హొడైదా నగరం దద్దరిల్లింది. మృత్యుల్లో 11 మంది ప్రభుత్వ సైనికులు, 73 మంది హుతి తిరుగుబాటుదారులు ఉన్నారు. 17 మంది సైనికులు తీవ్రంగా గాయపడగా.. పదులసంఖ్యలో తిరుగుబాటుదారులు గాయాలపాలయ్యారు.

621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles