అమెరికాలో ఘోర ప్రమాదం

Sat,January 5, 2019 01:51 AM

7 People killed in an accident in America

-రెండు ఆయిల్ రిగ్గులు, రెండు వాహనాలు ఢీ
-ఏడుగురు మృతి.. మృతుల్లో ఐదుగురు చిన్నారులు

ఫ్లోరిడా, జనవరి 4: అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. రెండు ఆయిల్ రిగ్గులు, రెండు వాహనాలు ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మరణించారు. ఈ సంఘటన గురువారం గైనెస్‌విల్లే సమీపంలో ఉన్న ఫ్లోరిడా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మొదట ఓ ఆయిల్ రిగ్గు, ఓ వాహనం ఢీకొన్నాయి. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో ఆయిల్ రిగ్గు, చర్చి వ్యాన్ కూడా ఢీకొనడంతో భారీగా డీజిల్ నేలపాలైంది. దాదాపు 189 లీటర్ల డీజిల్ రోడ్డుపై పారడంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. దీంతో చర్చి వ్యాన్‌లో ఉన్న ఐదుగురు చిన్నారులు, వ్యాన్ డ్రైవర్, వాహనం డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు అని అధికారులు తెలిపారు. ఈ చిన్నారులు లూసియానా నుంచి డిస్నీ వరల్డ్‌కు బయలుదేరారని ఇంతలోనే వారిని మృత్యువు కబలించిందని చెప్పారు. గాయపడిన ఎనిమిది మందిని దవాఖానకు తరలించామని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని పేర్కొన్నారు. భారీ మంటల ధాటికి జాతీయ రహదారిలోని కొంత భాగం దెబ్బతిన్నదని దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేశామని వివరించారు.

773
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles