ఆఫ్ఘన్‌లో ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి


Thu,May 17, 2018 03:37 AM

ఢాకా, మే 15: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోయారు. ఫర్హా రాష్ట్ర రాజధానిపై విరుచుకుపడ్డారు. మంగళవారం విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడటంతో ఆరుగురు భద్రతా సిబ్బంది మరణించారని, 12 మంది గాయపడ్డారని అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నజీబ్ డానిష్ తెలిపారు. ఫర్హా రాష్ట్ర కౌన్సిల్ చీఫ్ ఫరీద్ మాట్లాడుతూ రాజధాని చుట్టూ ఉన్న సెక్యూరిటీ చెక్‌పోస్టులను తాలిబన్లు ధ్వంసం చేశారని, తాలిబన్లకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు.

478
Tags

More News

VIRAL NEWS