ట్రంప్ చూపు కోసం రూ.38వేల ఖర్చు

Wed,June 13, 2018 02:51 AM

38000 To Crash Singapore Summit Meet Trump

maharaj-mohan
సింగపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దగ్గరినుంచి చూసేందుకు భారత సంతతికి చెందిన మలేషియా పౌరుడు మహారాజ్ మోహన్ రూ.38 వేలు ఖర్చు చేశాడు. ట్రంప్ సింగపూర్‌లోని షాంగ్రీలా హోటల్‌లో బస చేస్తారని ముందే తెలుసుకున్న మోహన్ తాను కూడా అదే హోటల్‌లో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. ట్రంప్‌ను ఎలాగైనా కలుసుకోవాలని భావించిన మోహన్ సోమవారం దాదాపు ఐదు గంటల పాటు హోటల్ లాబీలో వేచి ఉన్నాడు. ట్రంప్ రాక పోకల సమయంలో ఆయనను కలుసుకొని ట్రంప్: ది ఆర్ట్ ఆఫ్ ది డీల్ పుస్తకంపై సంతకం తీసుకోవాలని ఎదురు చూశాడు. తన ప్రయత్నం సఫలం కాకపోవడంతో తిరిగి మంగళవారం ఉదయం 6.30 గంటలకే లాబీలోకి వచ్చాడు. ఎట్టకేలకు ఉదయం 8.00 గంటల సమయంలో ట్రంప్ లాబీలోకి వచ్చినా మోహన్‌కు ఆయనను చూడటం తప్ప కలిసే అవకాశం లభించలేదు. ఇంతగా కష్టపడిన మోహన్‌కు చివరికి ట్రంప్ ప్రయాణించే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ది బీస్ట్ వద్ద ఒక సెల్ఫీ తీసుకొనే అవకాశం మాత్రం లభించింది.

3229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles