మాలిలో జాతుల మధ్య ఘర్షణలు..

Thu,June 20, 2019 01:05 AM

38 killed in attacks on Mali villages

- 38 మంది మృతి

బమాకో, జూన్ 19: పశ్చిమాఫ్రికాలోని సెంట్రల్ మాలిలో రక్తం ఏరులై పారింది. రెండు గ్రామాల్లోకి చొరపడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో 38 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. డోగాన్ జాతికి చెందిన ప్రజలు నివసిస్తున్న రెండు గ్రామాలపై సోమవారం ఉగ్రదాడులు జరిగాయి. దీంతో 38 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు అని అధికారులు తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని చెప్పారు. ఈ ప్రాంతంలో డోగాన్ జాతి వారికి, ఫులానీ జాతి వారికి మధ్య అస్సలు పడదని, ఇరు సామాజిక వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకొని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు. దాడి జరిగిన విషయం తెలియగానే భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని, ప్రజలకు రక్షణ కల్పించే చర్యలను చేపట్టాయని వివరించారు. డోగాన్ జాతికి చెందిన ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ఈ నెల ప్రారంభంలో కూడా ఇలాంటి దాడి ఒకటి జరిగింది. సొబానే దా గ్రామంలో జరిగిన ఈ దాడిలో 35 మంది డోగాన్ జాతికి చెందిన ప్రజలు మరణించారు అని తెలిపారు.

306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles