పాక్ భారీ కాయుడు ఇక లేరు

Tue,July 9, 2019 02:30 AM

330 KG heavy man Noorul Hassan passes away

-వైద్య సిబ్బంది నిరసనతో ఐసీయూలో మృతి
లాహోర్, జూలై 8: పాకిస్థాన్‌కు చెందిన భారీ కాయుడు నూరుల్ హసన్(55) అనూహ్య పరిస్థితుల్లో సోమవారం మృతి చెందారు. ట్యాక్సీ డ్రైవర్ అయిన ఆయన స్థూలకాయం 330 కేజీల బరువుతో గత కొన్నేండ్లుగా సాదిక్‌బాద్‌లోని తన నివాసానికే పరిమితమయ్యారు. వైద్య సహాయం కోసం సామాజిక మాధ్యమాల్లో హసన్ చేసిన విన్నపానికి పాక్ ఆర్మీ జనరల్ బజ్వా స్పందించారు. జూన్ 18న ప్రభుత్వ సిబ్బంది ఆయన ఇంటి గోడలు పగులగొట్టి బయటకు తీశారు. ట్రక్‌లో ఫుట్‌బాల్ మైదానానికి తీసుకెళ్లి అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో లాహోర్‌లోని షాలిమార్ దవాఖానకు తరలించారు. జూన్ 29న నూరుల్ హసన్‌కు లిపోసక్షన్ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా సోమవారం ఉదయం ఆ దవాఖానలో బిడ్డను ప్రసవించిన ఓ మహిళ చనిపోయింది. ఆమె బంధువులు ఆగ్రహంతో డాక్టర్లు, సిబ్బందిపై దాడి చేశారు. నిరసనగా ఐసీయూ సిబ్బంది గంటపాటు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో హసన్ ఆరోగ్య పరిస్థితి విషమించి గుండెపోటుతో చనిపోయినట్లు సర్జరీ చేసిన డాక్టర్ మాజుల్ హసన్ తెలిపారు. నూరుల్ మృతిపట్ల పాక్ సైనాధ్యక్షుడు జనరల్ బజ్వా సంతాపం తెలిపారు.

508
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles