కాలిఫోర్నియాలో కాల్పులు... ముగ్గురి మృతి

Sun,January 6, 2019 12:59 AM

3 people dead in shooting at a bowling alley in Southern California

-మరో నలుగురికి గాయాలు
వాషింగ్టన్, జనవరి 5: అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. లాస్ ఏంజెల్స్‌కు సమీపంలోని ఓ గేమింగ్ కాంప్లెక్స్‌లో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారని, మరో నలుగురు గాయపడ్డారని కాలిఫోర్నియా పోలీసులు శనివారం తెలిపారు. బాధితులందరూ పురుషులేనని చెప్పారు. శుక్రవారం రాత్రి 11.50 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. గేమింగ్ కాంప్లెక్స్‌లో గొడవ జరిగిందని, ఈ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని దవాఖానకు తరలించినట్లు చెప్పారు. కాగా, అమెరికా ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం 2017లో ఆ దేశంలో తుపాకీ కాల్పుల ఘటనల్లో 40 వేల మంది (ఆత్మహత్య చేసుకున్నవారితో కలిపి) దుర్మరణం చెందారు.

380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles