3డీలో సౌరవిస్ఫోటనాలు


Mon,March 12, 2018 02:54 AM

మూడు ఉపగ్రహాల సాయంతో రూపొందించిన నాసా
Solar-eruption
వాషింగ్టన్, మార్చి 11: సూర్యుడిపై సంభవించే విస్ఫోటనాలను, వాటి ఫలితంగా వెలువడే తరంగాలను నాసా శాస్త్రవేత్తలు 3డీ మ్యాపింగ్ చేశారు. ఆ తరంగాలను కంప్యూటర్‌లో పునఃసృష్టించగలిగారు. ఇలాంటి విస్ఫోటనాలతో భూ వాతావరణం, అంతరిక్షంలోని వ్యోమగాములు, ఉపగ్రహాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఎలాంటి నష్టం కలుగుతుందో అంచనా వేయడానికి 3డీ మ్యాప్‌లు ఉపయోగపడుతాయని నాసా పేర్కొన్నది. అమెరికాలోని జార్జ్ మాసన్, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తల బృందం మూడు ఉపగ్రహాల నుంచి సేకరించిన సమాచారంతో ఈ 3డీ మ్యాప్‌లను రూపొందించారు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా సంయుక్తంగా ప్రయోగించిన సోలార్ అండ్ హెలియోస్పెరిక్ అబ్జర్వేటరీ (ఎస్‌వోహెచ్‌వో), నాసాకు చెందిన రెండు సోలార్ టెర్రెస్ట్రియల్ రిలేషన్స్ అబ్జర్వేటరీ (ఎస్‌టీఈఆర్‌ఈవో)లను సూర్యుడి వైపు నిర్ణీత దిశలో ఉంచి భారీ పేలుళ్లు జరిగి, శక్తివంతమైన తరంగాలు వెలువడినప్పుడు సమాచారం సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా వారు కంప్యూటర్‌లో కృత్రిమ విస్ఫోటనాలను సృష్టించగలిగారు. విస్ఫోటనాల పరిమాణాన్ని బట్టి అవి వెలువరిచే తరంగాల తీవ్రత, భూమి వరకు చేరే అవకాశం వంటివి అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

319
Tags

More News

VIRAL NEWS