సోయుజ్ ప్రయోగం విజయవంతం

Wed,December 5, 2018 02:41 AM

3 astronauts safely aboard International Space Station

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ముగ్గురు వ్యోమగాములు
బైకనూర్ (కజకిస్థాన్): రష్యా వ్యోమనౌక సోయుజ్ ద్వారా రష్యా, అమెరికా, కెనడాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్)కు మంగళవారం వేకువజామున విజయవంతంగా చేరుకున్నారు. అక్టోబర్‌లో మానవసహిత ప్రయోగం విఫలమైన తర్వాత విజయవంతమైన మొదటి ప్రయోగం ఇదే కావడం గమనార్హం. రష్యాకు చెందిన వ్యోమగామి ఒలేగ్ కోనోనెన్కో, అమెరికాకు చెందిన అన్నె మెక్‌క్లెయిన్, కెనడాకు చెందిన డేవిడ్ సెయింట్ జాక్వెస్ కజకిస్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్ వ్యోమనౌక ద్వారా సోమవారం నింగిలోకి దూసుకెళ్లారు. ఈ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆరునెలలపాటు గడుపుతారని రష్యా అంతరిక్ష ప్రయోగ సంస్థ రోస్కోస్మోస్ ట్విట్టర్‌లో వెల్లడించింది.

336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS