రెచ్చిపోయిన తాలిబన్లు

Mon,September 10, 2018 02:28 AM

29 killed in Afghanistan as anti Taliban leader mourned

వేర్వేరు దాడుల్లో 29 మంది ఆఫ్ఘన్ భద్రతా సిబ్బంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు వేరువేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 29 మంది భద్రతా సిబ్బంది మరణించారు. శనివారం అర్ధరాత్రి పశ్చిమ కాబూల్‌లో జరిపిన కాల్పుల్లో 10 మంది పోలీసులు మరణించగా, హీరత్ రాష్ట్రంలో జరిపిన దాడిలో 9 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భగ్లాన్‌లో ఉన్న చెక్‌పాంట్లపై తాలిబన్ల దాడుల్లో ఐదుగురు సైనికులు, నలుగురు పోలీసు అధికారులు మరణించారు. ఆదివారం కాబుల్‌లో తాలిబన్ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో ఒకరు మృతిచెందారు. తాలిబన్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో పలువురు తాలిబన్లు హతమయ్యారని పోలీసులు తెలిపారు.

714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles