సైనిక స్థావరంపై దాడి

Wed,February 6, 2019 01:31 AM

26 jawans killed

-26 మంది జవాన్ల మృతి..
-ఆఫ్ఘన్‌లో ఘటన
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మళ్లీ రెచ్చిపోయారు. కుందుజ్ ప్రొవిన్స్‌లోని సైనిక స్థావరంపై తాలిబన్లు జరిపిన 26 మంది సైనికులు, పోలీసులు మృత్యువాత పడ్డారు. సోమవారం అర్ధరాత్రి రెండు గంటలకు ఈ ఘటన జరిగింది. తాలిబన్లు దాడి చేసిన సంగతి తెలియగానే అప్రమత్తమైన సైనిక బలగాలు, ఇతర ప్రాంతాల నుంచి అదనపు బలగాలను రప్పించారు. దాదాపు ఐదుగంటల పాటు ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సోమవారం రాత్రి రష్యా రాజధాని మాస్కోలో తాలిబన్లతో చర్చలకు మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయి సారథ్యంలోని ప్రతినిధి బృందం బయలుదేరి వెళ్లగా, ఈ దాడి జరుగడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles