ఖార్టోమ్: సుడాన్ రాజధాని ఖార్టోమ్ నగర పరిధిలోని ఒక టైల్స్ తయారీ ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ పేలడంతో 23 మంది మరణించగా, 130 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ఖార్టోమ్లోని పారిశ్రామిక వాడలో మంగళవారం చోటు చేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ పేలిపోవడంతో అగ్ని ప్రమాదం సంభవించింది.