సుడాన్‌లో కూలిన విమానం

Mon,September 10, 2018 01:49 AM

21 dead as plane crashes into lake in South Sudan

-21 మంది దుర్మరణం
-పరిమితికి మించిన ప్రయాణికుల కారణంగానే ప్రమాదం

జుబా: దక్షిణ సుడాన్‌లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న వాణిజ్య విమానం ఆదివారం కుప్పకూలింది. దీంతో 21మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. 19 సీట్ల పరిమితి కలిగిన చిన్నపాటి వాణిజ్య విమానం దక్షిణ సుడాన్ రాజధాని జుబా నుంచి యిరోల్ నగరానికి వెళ్తుండగా మార్గ మధ్యలో సరస్సులో కూలిపోయిందని సమాచార శాఖ మంత్రి తబాన్ అబెల్ అగ్వెక్ చెప్పారు. ఆరేండ్ల చిన్నారి, ఇటలీ వైద్యుడు, మరో వ్యక్తి తీవ్రగాయాలతో బయటపడ్డారని, వీరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించామన్నారు. సరస్సు నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకొన్న అధికారులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

720
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles