సుడాన్ ప్రమాదంలో 18 మంది భారతీయుల మృతి

Thu,December 5, 2019 01:08 AM

-భారత రాయబార కార్యాలయం వెల్లడి
-మృతులు, బాధితుల్లో ఆరుగురు తమిళులు

ఖార్టూమ్: సుడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని ఒక టైల్స్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడు ఘటనలో మరణించిన వారిలో 18 మంది భారతీయులు ఉన్నారని భారతీయ రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది.క్షతగాత్రుల్లో ఏడుగురు భారతీయులు కాగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నదన్నది. ఖార్టూమ్‌లోని బాహ్రీ ప్రాంతంలోని సీలా సిరామిక్స్ టైల్స్ ఫ్యాక్టరీలో మంగళవారం గ్యాస్ ట్యాంకర్ పేలిపోవడంతో 23 మంది మరణించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భారతీయ మృతులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు, సుడాన్ పేలుడు ఘటనలో గాయపడిన, అదృశ్యమైన భారతీయుల్లో ఆరుగురు తమిళులు ఉన్నారని ఆ రాష్ట్ర సీఎం కే పళనిస్వామి తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సాయం అందించడంతోపాటు అదృశ్యమైన వారి ఆచూకీ కోసం జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. మరోవైపు ప్రమాదం జరిగిన టైల్స్ ఫ్యాక్టరీలో 68 మంది భారతీయులు పని చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. వీరిలో 53 మంది ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలోనే ఉన్నట్టు పేర్కొన్నాయి. ట్యాంకర్ పేలిన నేపథ్యంలో సుడాన్ ప్రభుత్వం 24 గంటలు పనిచేసే ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ (249-921917471)ను ఏర్పాటు చేసింది.

612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles