ట్రంప్ ఎమర్జెన్సీపై 16 రాష్ర్టాల దావా

Wed,February 20, 2019 12:18 AM

16 States Sue to Stop Trump Use of Emergency Powers to Build Border Wall

వాషింగ్టన్: వివాదాస్పద మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి జాతీయ ఎమర్జెన్సీ వి ధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలపై ఆ దేశంలోని 16 రాష్ర్టాలు కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టులో మంగళవారం పిటిషన్ వేశాయి. ట్రంప్ ప్రభుత్వ ఎమర్జెన్సీ, నిధుల మళ్లింపు నిర్ణయం రాజ్యాంగ, చట్టవిరుద్ధమని ఆ 16 రాష్ర్టాలు తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. మెక్సికో గోడ కోసం ట్రంప్ 5.7 బిలియన్ల డాలర్ల నిధులు కోరగా, అమెరికా కాంగ్రెస్ 1.375 బిలియన్ డాలర్లే కేటాయించింది. దేశంలో ప్రభుత్వ స్తంభన నివారణకు బిల్లును ఆమోదించిన ట్రంప్.. తర్వాత గోడ నిర్మాణ నిధుల కోసం జాతీయ ఎమర్జెన్సీ విధించారు. దీంతో ఆయనకు అసాధారణ అధికారాలు లభించనున్నాయి.

449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles