భారత సిబ్బందితో వెళ్తున్న నౌకల్లో అగ్నిప్రమాదం

Wed,January 23, 2019 01:46 AM

-14 మంది దుర్మరణం.. ఆరుగురు గల్లంతు
-15 మంది భారత నావికులు సురక్షితం
-రష్యా ప్రాదేశిక జల్లాల్లో దుర్ఘటన

మాస్కో: భారత్, టర్కీ, లిబియా సిబ్బందితో వెళ్తున్న రెండు నౌకలు మంటల్లో చిక్కుకున్నాయి. రష్యా నుంచి క్రిమియాను వేరుచేసే కెర్చ్ జలసంధిలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 14 మంది నావికులు మరణించారు. రష్యా ప్రాదేశిక జలాల్లో సోమవారం సంభవించిన ఈ అగ్నిప్రమాదం నుంచి 15 మంది భారత నావికులు సురక్షితంగా బయటపడినట్లు ముంబైలోని డీటీఎస్(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్) అధికారులు తెలిపారు. టాంజానియా జాతీయ పతకాలు గల రెండు నౌకల్లో ఒకటి ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) రవాణా నౌక, మరొకటి ట్యాంకర్. రష్యా వార్తా సంస్థ టాస్ కథనం ప్రకారం ఒక నౌక నుంచి మరో నౌకకు ఇంధనాన్ని మారుస్తుండగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గురైన క్యాండీ అనే నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది భారతీయులు, తొమ్మిది మంది టర్కీ జాతీయులు. మరో నౌక మ్యాస్ట్రోలో గల 15 మంది సిబ్బందిలో ఏడుగురు భారతీయులు, ఏడుగురు టర్కీ జాతీయులు, మరో లిబియన్ ఉన్నారు. ఈ ప్రమాద కారణమేమిటో చెప్పలేనని, ప్రమాదంలో 14 మంది నావికులు మరణించినట్లు తమకు సమాచారం అందిందని క్రిమియా మారిటైమ్ సంస్థ అధిపతి సెర్గీ అక్సియొనోవ్ మంగళవారం విలేకరులకు తెలిపారు. మృతుల్లో ఏ దేశం వారు ఎంతమందో వివరించలేదు. ఓ నౌకలో పేలుడు సంభవించి మరో నౌకకు మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నట్టు రష్యా మారిటైమ్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదని, గల్లంతైన నావికులు సజీవంగా ఉంటారన్న ఆశలు లేవన్నారు.

696
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles