తల్లితండ్రుల చెరలో 13 మంది పిల్లలు

Wed,January 17, 2018 01:56 AM

13 siblings held captive in filthy California home police say

-చీకటి గదుల్లో గొలుసులతో బంధించారు
-ఆహారం పెట్టకుండా మలమలమాడ్చారు
-కాలిఫోర్నియాలో దారుణం

children-capitive
కాలిఫోర్నియా, జనవరి 16: అమెరికాలోని కాలిఫోర్నియాలో కనీవిని ఎరుగని రాక్షసత్వం. తల్లితండ్రులే 13 మంది పిల్లలను, తమ సొంత ఇంట్లోనే బంధించి హింసించారు. తిండిపెట్టకుండా మలమలమాడ్చారు. బాధితులైనవారిలో రెండేండ్ల చిన్నారి నుంచి 29 ఏండ్ల యువతి వరకు ఉన్నారు. వీరిలో 17 ఏండ్ల అమ్మాయి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ దారుణం బయటపడింది. పెర్రిస్‌లో ఆ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆ దృశ్యాలు చూసి షాకయ్యారు. కొంతమంది పిల్లలను చీకటి గదిలో మంచాలకు కట్టేసి ఉంచారు. వారి చుట్టూ బాగా మురికిపేరుకొపోయింది. ఆకలితో అలమటించినపోతున్న వారికి వెంటనే ఆహారం అందించి, చికిత్స కోసం దవాఖానలకు తరలించారు. వీరిని బంధించిన డేవిడ్ అలెస్‌టర్పిస్ (57), లూయీస్ అన్నాటర్పిస్ (49)ను ఆదివారం పోలీసులు అరెస్టుచేశారు. 2010 నుంచి వీరు పెర్రిస్‌లోని అదే ఇంట్లో నివసిస్తున్నట్టు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి.

299

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles