అమెరికా నైట్ క్లబ్‌లో కాల్పులు

Fri,November 9, 2018 02:17 AM

13 dead including gunman at California nightclub

-ఒక పోలీసు అధికారితోపాటు 12 మంది మృతి..
-ఆత్మహత్య చేసుకున్న హంతకుడు?
-మాజీ నౌకాదళ అధికారిగా గుర్తింపు

వాషింగ్టన్/ లాస్ ఏంజిల్స్, నవంబర్ 8: అమెరికాలోని ఒక నైట్ క్లబ్‌లో సాయుధుడు జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా రాష్ట్రం థౌజండ్ ఓకేస్ సిటీ పరిధిలో గల బోర్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్స్ నైట్‌క్లబ్‌లో విద్యార్థులు బుధవారం రాత్రి కాలేజీ కౌంటీ నైట్ పేరిట వేడుక జరుపుకుంటుండగా స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 11.20 గంటలకు నల్లని దుస్తులు ధరించిన వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. నైట్‌క్లబ్ ప్రధాన ద్వారం వద్ద నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో వేడుక జరుపుకుంటున్న విద్యార్థులంతా హహాకారాలు చేశారు. ప్రాణాలను కాపాడుకునేందుకు నేలపై పడుకున్నారు. మరికొందరు ప్రాణభీతితో పరుగులు తీశారు. కుర్చీలతో కిటికీల అద్దాలు పగులగొట్టి బయటకు దూకేశారు. ఇంకొందరు వెనుక ద్వారం నుంచి తప్పించుకున్నారు. దాడి సంగతి తెలిసిన వెంటనే స్థానిక పోలీసు అధికారి రొన్ హెలుస్ సారథ్యంలో భద్రతా సిబ్బంది నైట్‌క్లబ్ వద్దకు చేరుకుని సాయుధుడిపై ఎదురు కాల్పులు జరిపారు. సాయుధుడు జరిపిన కాల్పుల్లో పోలీసు అధికారి రొన్ హెలుస్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. సాయుధుడి కాల్పుల్లో 11 మంది వ్యక్తులు మరణించాడు.

night-club2
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. భద్రతా సంస్థలు అక్కడికి చేరుకోవడంతో సాయుధుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? జవాన్లే మట్టుబెట్టారా? అన్న సంగతి తెలియలేదు. అతడి ఉద్దేశం ఏమిటో తెలియదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు, ఉగ్రవాదంతో సంబంధం ఉన్నదా? అన్న విషయం ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. మానసిక సమస్యలతో బాధపడు తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాల్పులు జరిపిన యువకుడి పేరు ఇయాన్ డేవిడ్ లాంగ్ (28), అతడు అమెరికా మాజీ నౌకాదళ అధికారి అని చెప్పారు. కాగా కాల్పులకు ముందు నిందితుడు తొలుత పొగబాంబులు విసిరి ఉంటాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ తర్వాత సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిస్పందిస్తూ మృతులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఘటన జరిగిన మూడు నిమిషాల్లోనే కాలిఫోర్నియా హైవే పెట్రోల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, ఇతర అధికారులు సకాలంలో ప్రతిస్పందించడంతోపాటు గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించారు అని ట్వీట్ చేశారు.

509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS