బస్సు లోయలో పడి 11 మంది మృతి

Sun,October 13, 2019 02:42 AM

108 మందికి గాయాలు; నేపాల్‌లో దుర్ఘటన
కాఠ్మండు: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 11మంది మరణించారు. 108 మంది గాయపడ్డారు. అధికారులు మాట్లాడుతూ హిందువుల ప్రముఖ పండుగ దషైన్‌ను జరుపుకోవడానికి ప్రయాణికులు సింధూపల్‌చౌక్ నుంచి కాఠ్మండుకు బయలుదేరారని చెప్పారు. అయితే సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో మార్గమధ్యంలో 50 మీటర్లకుపైగా ఉన్న లోయలో బస్సు పడిపోయిందని తెలిపారు. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారని, మిగిలిన ఐదుగురు దవాఖానకు తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles