పాక్ దర్గాలో ఆత్మాహుతి దాడి


Fri,February 17, 2017 03:43 AM

-70మంది మృతి, 150మందికి గాయాలు

pakisthan
కరాచీ: పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రంలో గురువారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో వందమంది మరణించగా 150మంది గాయపడ్డారు. సేవాన్ పట్టణంలోని సుప్రసిద్ధ సూఫీ లాల్ షాబాజ్ కలందర్ దర్గాలోకి ప్రవేశించిన ఆగంతకుడు ముందుగా గ్రనేడ్ విసిరాడు. అది పేలకపోవడంతో తనను తాను పేల్చేసుకున్నాడు. సంప్రదాయిక సూఫీ నాట్యం ఢమాల్ జరుగుతుండగా ఆగంతకుడు దర్గాలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించాడు. వారంరోజుల్లో పాకిస్థాన్‌లో జరిగిన ఐదో భీకర ఉగ్రదాడి ఇది. ఈ దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐఎస్ ప్రకటించుకున్నది. పాక్‌లోని సింధ్ రాష్ట్రంలో ఒక సూఫీ దర్గాపై దాడి జరిగినట్టు ఐఎస్‌కు చెందిన అమాక్ వార్తాసంస్థ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. తెహరిక్-ఏ-తాలిబన్ ఉగ్రవాదులు తరచుగా దర్గాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరుపుతుంటారు. సింధ్ హైదరాబాద్‌కు 120 కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఈ దాడి జరుగడంతో సహాయకార్యక్రమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మృతులను, గాయపడినవారిని తరలించేందుకు హెలికాప్టర్లు సమకూర్చాల్సిందిగా అధికారులు పాక్ సైన్యాన్ని అభ్యర్థించినట్టు సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సయ్యద్ మురాదలీషా చెప్పారు. భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే గురువారం రోజు దర్గాపై దాడి జరుగడంతో మృతుల సంఖ్య అధికంగా ఉందని భావిస్తున్నారు.

1396
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS