బ్రెజిల్‌లో 10 మంది మృతి

Sat,February 9, 2019 12:58 AM

10 killed in Brazil

- శిక్షణ కేంద్రంలోఅగ్నిప్రమాదం..
రియో డీ జానిరో: బ్రెజిల్‌లోని వర్జిం గ్రాండీ జిల్లాలో ఉన్న ప్రముఖ ఫుట్‌బాల్ శిక్షణ కేంద్రంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు క్రీడాకారులు కాగా.. మరో నలుగురు సిబ్బంది ఉన్నారు. ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ కేంద్రంలో బ్రెజిల్‌కు చెందిన ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ ఫ్లెమింగో క్రీడాకారులు కూడా శిక్షణ పొందుతుంటారు. అధికార వర్గాలు మాట్లాడుతూ శిక్షణ కేంద్రంలోని యువ ఆటగాళ్ల గదిని ఒక్కసారిగా మంటలు కమ్మేశాయని, దీంతో 10 మంది మరణించారని తెలిపాయి. ప్రమాదం తెల్లవారుజామున 5 గంటలకు చోటుచేసుకున్నదని పేర్కొన్నాయి.

685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles