క‌ర్పూరాన్ని ఇలా కూడా వాడుకోవ‌చ్చు తెలుసా..!


Thu,October 5, 2017 12:40 PM

పూజ సంద‌ర్భంగా దైవానికి హార‌తి ఇచ్చేందుకు మాత్ర‌మే చాలా మంది క‌ర్పూరాన్ని వాడుతారు. అయితే నిజానికి క‌ర్పూరం కేవలం అందుకే కాదు, ఇంకా అనేక అవ‌స‌రాల‌కు ప‌నికొస్తుంది. దీని వ‌ల్ల దోమ‌ల‌ను త‌రిమికొట్ట‌వ‌చ్చు. మ‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. తేలు, పాము విషాల‌కు విరుగుడుగా ప‌నిచేస్తుంది. ఇంకా అనేక ఉప‌యోగాలు క‌ర్పూరం వ‌ల్ల ఉంటాయి. అవేమిటో కింద తెలుసుకుందాం.

1. నీటిలో కర్పూరం బిళ్లలను వేసి మంచం కింద ఉంచితే దోమలు రాకుండా ఉంటాయి ..మన ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉండేలా చేస్తుంది. అంటువ్యాధులు రాకుండా చూస్తుంది.

2. కొన్ని కర్పూరం బిళ్ళలను ఒక గుడ్డలో చుట్టి రాత్రి పడుకునే ముందు మెడలో వేసుకుని ఉదయం తీసివేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీర జీవ క్రియలు స‌రిగ్గా జ‌రుగుతాయి.

3. తేలు లేదా పాము కుట్టినచోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరం కలిపి అరగంటకోసారి భాదితులకు తాగిస్తూ ఉంటే శరీరంలోని విషం చెమట, మూత్రం రూపంలో బయటకి పోతుంది.

4. చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెలో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య మాయమవుతుంది. పేల‌ సమస్య కూడా దూరం అవుతుంది.

5. ఉదయం బ్రష్ చేసేప్పుడు దానిపై కర్పూరం వేసుకుని దంతాలు శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది. నోట్లో ఉండే క్రిములు చ‌నిపోతాయి.

6. వానాకాలంలో ఈగల‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి ఆ నీటితో నేల‌ను తుడిస్తే ఈగలు రాకుండా ఉంటాయి.

7802

More News

VIRAL NEWS

Featured Articles