పొడి చ‌ర్మం స‌మ‌స్య‌కు వెన్న‌తో చెక్..!


Tue,February 13, 2018 12:49 PM

చ‌ర్మం పొడిగా మారితే ఎవ‌రికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ క్ర‌మంలో పొడి చ‌ర్మాన్ని మృదువుగా చేసుకునేందుకు అధిక శాతం మంది వివిధ ర‌కాల క్రీముల‌పై ఆధార ప‌డుతుంటారు. కానీ అలాంటి కృత్రిమ ప‌దార్థాల జోలికి వెళ్ల‌కుండా మ‌న ఇంట్లో స‌హ‌జ సిద్ధంగా ల‌భించే వెన్న‌తోనే డ్రై స్కిన్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక టీస్పూన్ వెన్న‌, ఒక టీస్పూన్ మీగ‌డ‌ల‌ను క‌లిపి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మ‌సాజ్ చేసి 20 నిమిషాలు ఆగాక చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది. ముఖం కాంతివంత‌మ‌వుతుంది.

2. ఒక టీస్పూన్ వెన్న‌ను ఒక టీస్పూన్ అర‌టి పండు గుజ్జులో క‌లిపి ముఖానికి రాసి ఆరిన త‌ర్వాత క‌డిగేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తే చ‌ర్మం మృదువుగా మారుతుంది. అంతేకాదు ముఖంపై ఉన్న ముడ‌త‌లు కూడా పోతాయి.

3. ఒక టీస్పూన్ వెన్న‌కు చిటికెడు ప‌సుపు క‌లిపి ముఖానికి రాసి అర‌గంట త‌రువాత క‌డిగేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

4. అర టీస్పూన్ వెన్న‌లో రెండు స్పూన్ల ఉడికించిన క్యారెట్ గుజ్జును క‌లిపి ముఖానికి రాసి అర‌గంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో చ‌ర్మం మృదుత్వాన్ని పొందుతుంది.

5. గుడ్డులోని తెల్ల సొన‌, అర టీస్పూన్ వెన్న‌ని తీసుకుని మిక్సీలో వేసి బాగా మెత్త‌గా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంత‌మ‌వుతుంది. మృదుత్వాన్ని కూడా పొందుతుంది.

2554

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles