HomeHealth News which one is best buffalo or cow milk

ఆవు పాలు, గేదె పాలు... వీటిలో ఏవి తాగితే మంచిది..!

Published: Tue,September 12, 2017 02:16 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

which one is best buffalo or cow milk

పాలు మ‌న‌కు సంపూర్ణ పౌష్టికాహార‌న్ని ఇస్తాయని అంద‌రికీ తెలిసిందే. పాల‌ను తాగ‌డం వ‌ల్ల విట‌మిన్ డి, కాల్షియం వంటి ముఖ్యమైన పోష‌కాలు మ‌న‌కు అందుతాయి. దీంతో ఎముక‌లు బ‌లంగా, దృఢంగా మారుతాయి. శ‌రీరం పెరుగుద‌ల స‌క్ర‌మంగా ఉంటుంది. అయితే ప్ర‌స్తుతం మ‌న‌లో అధిక శాతం మంది గేదె పాల‌ను తాగుతున్నారు. కొంద‌రు ఆవు పాల‌ను తాగుతున్నారు. మ‌రి ఈ రెండు పాల‌కూ తేడా ఏముంటుంది..? ఏ పాల‌ను తాగితే బెట‌ర్‌..? అంటే... అందుకు సమాధానాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవు పాలు, గేదె పాలు రెండూ పాలే అయినా వాటిలో కొన్ని తేడాలు ఉన్నాయి. అవేమిటంటే...
* ఆవు పాలు చాలా లైట్‌గా ఉంటాయి. త‌క్కువ ఫ్యాట్‌ను క‌లిగి ఉంటాయి. త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. అందుకే వాటిని శిశువుల‌కు తాగిస్తారు. ఆవు పాల‌తో ర‌స‌గుల్లా, ర‌స‌మ‌లై వంటివి చేస్తారు. ఇక ఈ పాలు కేవ‌లం 1, 2 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఆవు పాల‌లో నీరు ఎక్కువ‌గా ఉంటుంది. 90 శాతం నీటిని ఆవు పాలు క‌లిగి ఉంటాయి. దీంతో ఆవు పాల ద్వారా మ‌నకు ల‌భించే క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. ఆవు పాల‌లో కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, మెగ్నిషియం, పొటాషియం వంటి పోష‌కాలు కొంచెం త‌క్కువ‌గా ఉంటాయి.

* గేదె పాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. వీటిలో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంది. గేదె పాల‌ను ఎక్కువ‌గా ప‌న్నీర్‌, ఖీర్‌, కుల్ఫీ, పెరుగు, నెయ్యి త‌యారీలో వాడుతారు. గేదె పాల‌ను ఎన్ని రోజులైనా నిల్వ ఉంచవ‌చ్చు. గేదె పాల‌లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. కొవ్వు కూడా ఎక్కువే. అందువ‌ల్లే గేదె పాల‌తో మ‌న‌కు ల‌భించే క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి. గేదె పాల‌లో కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, మెగ్నిషియం, పొటాషియం ఎక్కువ‌గా ఉంటాయి.

మ‌రి ఈ రెండు ర‌కాల పాల‌లో ఏవి తాగితే బెట‌ర్ అంటే...
* అధిక బ‌రువు ఉన్న‌వారు ఆవు పాల‌ను తాగ‌డం బెట‌ర్‌. ఎందుకంటే క్యాల‌రీలు త‌క్కువ‌గా ల‌భిస్తాయి. దీనికి తోడు పోష‌కాలు కూడా అందుతాయి. క‌నుక అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

* స‌న్న‌గా ఉన్న‌వారు, జీర్ణ శ‌క్తి అధికంగా ఉన్న‌వారు నిక్షేపంగా గేదె పాలు తాగ‌వ‌చ్చు. వ్యాయామం రోజూ చేసేవారు కూడా గేదె పాల‌ను తాగ‌వ‌చ్చు.

* జీర్ణ‌శ‌క్తి అంతగా లేని వారు ఆవు పాల‌ను తాగితే బెట‌ర్‌. దీంతో పాలు తేలిగ్గా జీర్ణ‌మ‌వుతాయి. కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి.

3424

Recent News