బబుల్ గమ్ ను మింగితే ఏమ‌వుతుందో తెలుసా..?


Tue,September 12, 2017 03:18 PM

చూయింగ్ గ‌మ్‌... బ‌బుల్ గ‌మ్‌.. ఎలా పిలిచినా ఆ గ‌మ్‌ను తిన‌డం చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు దాంతో బుడ‌గ‌లు కూడా చేస్తుంటారు. స‌రే.. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే... బ‌బుల్ గ‌మ్ జిగురుగా ఉంటుంది క‌నుక‌, దాన్ని తిన్న‌ప్పుడు పొర‌పాటున గ‌మ్‌ను మింగితే అది లోప‌లికి వెళ్లి పేగుల‌కు చుట్టుకుంటుంద‌ని చాలా మంది అనుకుంటారు. మ‌రి ఇందులో నిజం ఎంత‌..? ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా చూయింగ్ గ‌మ్‌ల‌లో వివిధ ర‌కాల ఫ్లేవ‌ర్లు క‌లిగిన ప‌దార్థాలు, చ‌క్కెర వంటి వ‌స్తువుల‌తోపాటు సాగే గుణం వ‌చ్చేలా గ‌మ్‌ను పోలిన కొన్ని ప‌దార్థాల‌ను కూడా క‌లుపుతారు. అందువ‌ల్ల మ‌నం నోట్లో చూయింగ్ గ‌మ్ వేసుకోగానే తిండికి సంబంధించిన ప‌దార్థం అయిపోతూ క్ర‌మంగా గ‌మ్ బ‌య‌టికి వ‌స్తూ అది సాగుతూ ఉంటుంది. దీంతో కొంత మంది నోటి ద్వారా బెలూన్లు కూడా చేస్తుంటారు. అయితే ఆ గ‌మ్ ఒక వేళ పొర‌పాటున లోప‌లికి పోయినా అది మ‌న జీర్ణాశ‌యానికి మాత్రం అంటుకోద‌ట‌. దాన్ని జీర్ణం చేయ‌గ‌లిగే ప‌వ‌ర్‌ఫుల్ యాసిడ్లు మ‌న క‌డుపులో త‌యార‌వుతాయి. చూయింగ్ గ‌మ్‌లో మిగిలిపోయిన చ‌క్కెర‌, ఇత‌ర ఆహార ప‌దార్థాలు జీర్ణం కాగా మిగిలిందంతా వ్య‌ర్థ ప‌దార్థం కింద బ‌య‌ట‌కి వెళ్లిపోతుంది. కాబ‌ట్టి చూయింగ్ గ‌మ్‌ను మింగినా మ‌న‌కు క‌లిగే న‌ష్టం ఏమీ ఉండ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక ఎవ‌రైనా పొర‌పాటున చూయింగ్ గ‌మ్‌ను మింగితే ఆందోళ‌న చెంద‌కండి.

అయితే జీర్ణ ప్ర‌క్రియ స‌రిగ్గా లేనివారు గ‌మ్ మింగిన సంద‌ర్భంలో ఆ గ‌మ్ బ‌య‌ట‌కు గ‌న‌క వ్య‌ర్థంగా వెళ్ల‌క‌పోతే వారికి వికారం, వాంతులు, విరేచ‌నాలు, జ్వ‌రం వంటివి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించ‌డం మంచిది.

5493

More News

VIRAL NEWS