రోజూ 3 గంటలకు మించి టీవీ చూస్తే డయాబెటిస్ రిస్క్..!


Tue,March 14, 2017 04:49 PM

మీ పిల్లలు రోజూ 3 గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తున్నారా..? కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..! ఎందుకంటే అలా నిత్యం 3 గంటల కన్నా ఎక్కువ సేపు ఆయా మాధ్యమాలపై గడిపే పిల్లల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిసింది. యూనివర్సిటీ ఆఫ్ లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అక్కడి బర్మింగ్‌హామ్, లీసెస్టర్ సిటీల్లో ఉన్న 200 స్కూళ్లలో చదువుతున్న 9 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల 4500 మంది పిల్లలపై పరిశోధనలు చేశారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. ఆ పిల్లల అలవాట్లు, తీసుకునే ఆహారం, జీవన విధానం వంటి అన్ని అంశాలను రికార్డు చేశారు.

చివరికి తెలిసిందేమిటంటే... రోజూ 3 గంటలు అంతకన్నా ఎక్కువ సమయం పాటు టీవీ లేదా కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు వంటి డిజిటల్ స్క్రీన్‌లపై గడుపుతున్న పిల్లల మెటబాలిక్ రేట్, బరువు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. దీంతోపాటు వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు నిర్దారించారు. ఈ క్రమంలో ఆకలి, గ్లూకోజ్, ఇన్సులిన్‌లను నియంత్రించే లెప్టిన్ అనే హార్మోనుపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుందని వారు తెలిపారు. దీంతో అధిక బరువు సమస్య, టైప్ 2 డయాబెటిస్ వస్తాయని పేర్కొన్నారు.

2633

More News

VIRAL NEWS