లివర్‌లో కొవ్వును కరిగించే ఆహారాలివే తెలుసా..?


Sat,March 10, 2018 03:57 PM

ప్రపంచ వ్యాప్తంగా నేడు అనేక మంది ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కాగా, మరొకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. మొదటిది ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల వస్తుంది. రెండోది స్థూలకాయం, వ్యాయామం చేయకపోవడం, ఫ్యాట్, ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఫ్యాటీ లివర్ ఎలా వచ్చినా దీని వల్ల మన శరీరానికి హాని కలుగుతుంది. పలు ఇతర ప్రాణాంతక వ్యాధులకు అది దారి తీసేందుకు అవకాశం ఉంటుంది. అయితే కింద చెప్పిన విధంగా పలు ఆహారాలను రోజూ తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అందులో ఉన్న కొవ్వు పోతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

కాఫీ...


కాఫీలో ఉండే కెఫీన్ లివర్ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. లివర్‌లో తయారయ్యే హానికారక ఎంజైమ్‌లను తొలగించడంలో కెఫీన్ బాగా పనిచేస్తుంది. కనుక రోజూ కాఫీ తాగితే లివర్‌ను సంరక్షించుకోవచ్చు.

ఆకు పచ్చని కూరగాయలు...


ఆకుపచ్చ రంగులో ఉండే ఆకు కూరలు, కూరగాయలను రోజూ తినాలి. వీటిల్లో ఉండే ఔషధ గుణాలు లివర్‌లో పేరుకుపోయే కొవ్వును కరిగిస్తాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గిస్తాయి. లివర్ బాగా పనిచేసేలా చేస్తాయి.

చేపలు...


చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌లో ఉండే కొవ్వును కరిగిస్తాయి. లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. లివర్ వాపు తగ్గుతుంది.

ఓట్స్...


ఓట్స్‌లో ఉండే పీచు పదార్థం లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లివర్‌ను సంరక్షిస్తుంది. హానికారక పదార్థాలను బయటకు పంపుతుంది.

వాల్‌నట్స్...


వాల్‌నట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్‌కు మేలు చేస్తాయి. ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గిస్తాయి. లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి.

పాలు...


కొవ్వు తీసిన పాలలో ఉండే ప్రోటీన్లు లివర్‌కు మంచి చేస్తాయి. లివర్ డ్యామేజ్ కాకుండా చూస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

పైన చెప్పిన పదార్థాలే కాకుండా పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆలివ్ ఆయిల్, అవకాడోలు, వెల్లుల్లి, గ్రీన్ టీ వంటి ఆహారాలు కూడా లివర్ వ్యాధులను తగ్గిస్తాయి. లివర్‌లో ఉండే కొవ్వు కరిగేలా చేస్తాయి. దీంతో లివర్ సంరక్షింపబడుతుంది.

5976

More News

VIRAL NEWS