సీతాఫలం లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..!


Thu,October 12, 2017 11:40 AM

ప్ర‌స్తుత సీజ‌న్‌లో మ‌న‌కు సీతాఫ‌లం ఎక్కువ‌గా దొరుకుతుందనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇది సీజ‌న‌ల్ ఫ్రూట్ కావడం చేత క‌చ్చితంగా దీన్ని అంద‌రూ తినాల్సిందే. సీతాఫ‌లంలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉంటాయి. దీంతోపాటు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. సీతాఫలం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఏమేం లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది.

2. విటమిన్లు, లవణాలు అధికంగా ఉండి, చలికాలంలో ఎక్కువగా దొరికే ఈ సీతాఫలం మీగడలాంటి గుజ్జుతో, ప్రత్యేక రుచితో అందరి నోళ్లలోనూ నీళ్లూరిస్తుంది. ఈ పండును సీజన్ ముగిసేంతదాకా ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయటమే కాకుండా ఎన్నో పోషక విలువలను శరీరానికి అందిస్తుంది.

3. సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీల వరకు శక్తి ఉంటుంది. కార్బొహైడ్రేట్లు 48, ఫైబర్ 6 గ్రాములు, విటమిన్ సి 50 శాతం, కాల్షియం 2 శాతం, ఐరన్ 4 శాతం లభిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను ఒకటి లేదా రెండు తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది.

4. కండరాలను బలోపేతం చేయడమే కాదు బలహీనత, సాదారణ అలసటను సైతం దూరం చేస్తుంది. వాంతులు, తలనొప్పికి విరుగుడుగా పనిచేస్తుంది.

5. చర్మవ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇందులోని మెత్తని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముకల పుష్టిని కలిగిస్తుంది.

6. పేగుల్లో ఉండే హెల్మింత్స్ అనే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండు గుజ్జు అల్సర్‌పై చక్కటి మందులాగా ఉపశమనాన్నిస్తుంది.

ఆస్తమా ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు సీతాఫలాన్ని తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే బాగా పండిన పండును తింటే ఎలాంటి బాధా ఉండదు. లివర్, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం సీతాఫలానికి దూరంగా ఉండాలి.

16380

More News

VIRAL NEWS

Featured Articles