రోజూ 10 గ్రాముల వాల్‌న‌ట్స్ తింటే..?


Mon,November 13, 2017 04:53 PM

వాల్‌న‌ట్స్‌... చూసేందుకు ఇవి చిన్న‌పాటి మెద‌డు ఆకారంలో ఉంటాయి. కానీ ఇవి మ‌న శ‌రీరానికి అందించే ప్ర‌యోజ‌నాలు మాత్రం పుష్క‌లం. వాల్‌న‌ట్స్‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉంటాయి. ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ వీటి వ‌ల్ల మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే నిత్యం 10 గ్రాముల మోతాదులో.. అంటే.. క‌నీసం 5 నుంచి 6 వ‌ర‌కు వాల్‌న‌ట్స్‌ను తింటే దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిత్యం వాల్‌న‌ట్స్‌ను 10 గ్రాముల మోతాదులో తిన్నా చాలు. దాంతో అనేక లాభాలు క‌లుగుతాయి. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. గుండె సంబంధ స‌మస్య‌లు రావు. ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. ఫ‌లితంగా ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది.

2. వాల్‌న‌ట్స్‌ను రోజూ తింటే ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్ల‌లు, మ‌హిళ‌లు వాల్‌న‌ట్స్‌ను త‌మ డైట్‌లో భాగంగా చేసుకుంటే అనేక లాభాలు ఉంటాయి.

3. శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ మెరుగుప‌డుతుంది. థైరాయిడ్ గ్రంథి స‌రిగ్గా ప‌నిచేస్తుంది. అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

4. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు వాల్‌న‌ట్స్‌ను తింటే వారి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు త‌గ్గుతాయి. ఫ‌లితంగా మ‌ధుమేహం అదుపులోకి వ‌స్తుంది.

5. క్యాన్స‌ర్ వ్యాధిని అడ్డుకునే ఔష‌ధ గుణాలు వాల్ న‌ట్స్‌లో ఉన్నాయి. ఇవి క్యాన్స‌ర్ క‌ణ‌తుల పెరుగుద‌ల‌ను నిరోధిస్తాయి.

6. మ‌గ‌వారిలో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. వీర్యం బాగా వృద్ధి చెందుతుంది. సంతానం పొందాల‌నుకునే వారికి వాల్ న‌ట్స్ మేలు చేస్తాయి. అదే స్త్రీలు వాల్‌న‌ట్స్‌ను తింటే రుతు స‌మ‌స్య‌లు పోతాయి.

8778

More News

VIRAL NEWS