జొజొబా ఆయిల్ తెలుసా..? దాంతో కలిగే లాభాలివే..!


Sun,July 9, 2017 03:18 PM

'జొజొబా (Jojoba)'... ఈ పేరును దాదాపుగా ఎవరూ విని ఉండరు. నిజానికి ఇది ఓ మొక్క. దీన్నే గోట్ నట్, డీర్ నట్, పిగ్‌నట్, వైల్డ్ హేజల్, క్వినైన్ నట్, కాఫీబెర్రీ అని రక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క ఎక్కువగా అమెరికాలో పెరుగుతుంది. చూసేందుకు అచ్చం ఆలివ్ మొక్కలాగే ఉంటుంది. అయితే జొజొబా మొక్క విత్తనాల నుంచి తీసే నూనె మనకు చాలా ఉపయోగకరమైంది. ఈ జొజొబా ఆయిల్ మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ క్రమంలో దాని వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
jojoba-seeds
1. జొజొబా ఆయిల్‌ను ముఖంపై రాస్తే మొటిమలు, మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. ముఖానికి ప్రకాశం చేకూరుతుంది. ముఖ సౌందర్యం పెరుగుతుంది.

2. శరీరంలో ఇతర భాగాలపై రాసినా అక్కడి చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. చర్మంపై వచ్చే పగుళ్లు పోతాయి.

3. జొజొబా ఆయిల్‌ను జుట్టుకు రాస్తే వెంట్రుకలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. బట్టతల సమస్య రాదు. శిరోజాలు చిట్లిపోవు. మృదువుగా మారుతాయి.
jojoba-oil
4. జొజొబా ఆయిల్‌తో బాడీ మసాజ్ చేసుకుంటే శరీరం రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

5. గాయాలు, పుండ్లపై జొజొబా ఆయిల్‌ను రాస్తే అవి వెంటనే తగ్గుతాయి. చర్మంపై దద్దుర్లు, దురదలు వచ్చినా, గజ్జి, తామర వంటి చర్మవ్యాధులు సోకినా వాటిని జొజొబా ఆయిల్ తగ్గిస్తుంది.

3077

More News

VIRAL NEWS