రేగు పండ్లతో క‌లిగే లాభాలు తెలిస్తే.. వాటిని వ‌దిలి పెట్ట‌రు తెలుసా..!


Wed,January 10, 2018 03:02 PM

పులుపు, తీపి రుచుల క‌ల‌యిక‌తో ఉండే రేగు పండ్లు మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. ఇవి ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతాయి. మ‌న దేశంలో అనేక ప్రాంతాల్లో రేగు పండ్లు పండుతాయి. వీటిల్లో 40 జాతులకు పైగా ఉన్నాయి. పసుపు, కాఫీ రంగులు కలిసి, ఎరుపు లేదా బ్రిక్ రెడ్, గ్రీన్‌ త‌దిత‌ర‌ రంగుల్లో ఇవి మ‌న‌కు ల‌భిస్తున్నాయి. ఇక కొన్ని రేగు పండ్లు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. మరి కొన్ని పెద్దవిగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో భోగి రోజున ఈ పండ్లను భోగి పండ్ల పేరిట చిన్నారుల‌పై పోస్తారు. దీంతో వారు భోగభాగ్యాలతో తుల‌తూగుతార‌ని పెద్ద‌ల న‌మ్మ‌కం. అయితే ఇదే కాకుండా రేగు పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రేగు పండ్లలో వివిధ రకాల పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. సి విటమిన్ వీటిలో ఎక్కువగా ఉంటుంది. జామకాయ తరువాత ఈ విటమిన్ వీటిలోనే ఎక్కువగా ఉంటుంది.

2. రేగు పండ్ల ఆకులను రెండింటిని ప్రతి రోజూ ఒకటి లేదా రెండు పూటల పాటు చిన్నారులకు తినిపిస్తే వారికి కలిగే అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి.

3. కడుపులో మంటను తగ్గించే గుణం రేగు పండ్లకు ఉంది. అజీర్తికి బాగా పనిచేస్తాయి. గొంతు నొప్పి, ఆస్తమా, కండరాల నొప్పులను ఇవి తగ్గిస్తాయి.

4. రేగు పండ్ల గింజలను పొడి చేసి నూనెతో కలిపి రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగు చెట్టు బెరడును నీటిలో మరిగించి డికాక్షన్‌లా చేసుకుని తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

5. చేతి నిండుగా రేగు పండ్లను తీసుకుని ఒక అరలీటరు నీటిలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. ఆ ద్రవానికి చక్కెర లేదా తేనె కలిపి దాన్ని ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు తాగితే చక్కని ఆరోగ్యం చేకూరుతుంది. ఈ మిశ్రమంలో ఉండే గ్లుంటామిక్ యాసిడ్ మెదడు బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.

6. జ్వరం, జలుబు రాకుండా ఉండాలంటే తరచూ రేగు పండ్లను తినాలి. రేగు చెట్టు బెరడుతో చేసిన కషాయం మలబద్దకానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. రేగు ఆకులను నూరి దాన్ని కురుపుల వంటి వాటిపై రాస్తే త్వరగా నయమవుతాయి.

7. బరువు పెరిగేందుకు, కండరాలకు బలాన్నివ్వడంలో, శరీరానికి శక్తినిచ్చేందుకు రేగు పండ్లు చక్కగా ఉపయోగపడతాయి.

8. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలను ఇవి కలిగి ఉన్నాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి.

9. రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది.

10. రేగు చెట్టు వేర్లను పొడి చేసి గాయాలపై పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. వెంట్రుక‌లు పెరిగేందుకు రేగు పండ్లు దోహదపడతాయి.

9492

More News

VIRAL NEWS