టొమాటోకు అంత సీనుందా..!


Mon,May 15, 2017 05:34 PM

టొమాటో ఉత్తి కూర‌గాయ‌నే కాదు.. అది ప్ర‌ణాంత‌క వ్యాధి కేన్స‌ర్‌ను న‌యం చేసే మెడిసిన్ కూడా.. కేన్స‌ర్ రోగం విస్త‌రించ‌కుండా అడ్డుకునే శ‌క్తి టొమాలో ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. కేన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకుని వ్యాధి ముదుర‌కుండా చేస్తుంద‌ని ఇట‌లీ శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. సాన్‌మార్బానో, కార్బారినో ర‌కాల‌కు చెందిన టొమాటోల్ల ఈ శ‌క్తి ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. వీటినుంచి తీసిన సారం పొట్ట‌, గ్యాస్ట్రిక్ కేన్స‌ర్ క‌ణాల ఎదుగుద‌ల‌ను అడ్డుకుంటుంద‌ని సైంటిస్టులు వివ‌రించారు. కేన్స‌ర్ క‌ణాల‌కు వ‌ల‌స వెళ్లే గుణం ఉంటుంద‌ని, దీన్ని టోమాటోలో ఉన్న ఒక ర‌క‌మైన సారం అడ్డుకుంటుంద‌ని తెలిపారు. కేన్స‌ర్‌పై పోరుకు స‌రైన మందును క‌నుక్కునేందుకు ఈ ప్ర‌యోగ ఫ‌లితాలు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ ప‌డ్డారు.

3609

More News

VIRAL NEWS