ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే..?


Sun,June 18, 2017 04:35 PM

చాలా మందికి ప్ర‌యాణాల్లో వాంతులు అవుతుంటాయి. ముఖ్యంగా బ‌స్సుల్లో ప్ర‌యాణించేటప్పుడు అవి ఇంకా ఎక్కువ‌గా అవుతాయి. కొంద‌రికేమో బ‌స్సు మాత్ర‌మే కాదు అస‌లు కారు, రైలు ఇలా ఎందులో వెళ్లినా లేదంటే వంపులు తిరుగుతూ ఉన్న దారిలో ప్ర‌యాణించినా వాంతుల‌వుతాయి. ఈ క్ర‌మంలో అస‌లు ఇలా ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది. అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు. ఇవి వాంతులు, వికారం స‌మ‌స్య‌ల‌ను తగ్గిస్తాయి.

2. వక్కపొడి లాంటిది చప్పరిస్తున్నా కూడా ఈ ఫీలింగ్ నుండి బయటపడొచ్చు.

3. నిమ్మకాయను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలుస్తుంటే వాంతులు కాకుండా ఉంటాయి.

4. లవంగాలు, సోంపు లాంటివి దవడన‌ పెట్టుకుని చప్పరిస్తున్నా కూడా వాంతులు కాకుండా ఉంటాయి. వాంతికి వ‌చ్చే సెన్సేష‌న్ కూడా త‌గ్గుతుంది.

5. బ‌స్సులు, కార్ల‌లో ప్ర‌యాణించిన‌ప్పుడు ముందు సీట్ల‌లో కూర్చుని దృష్టిని ఎదురుగా నిల‌పాలి. దీంతో వాంతి వ‌చ్చే అవ‌కాశం త‌గ్గుతుంది.

9481

More News

VIRAL NEWS