ఏ పండులో ఏమున్నది..?


Mon,March 13, 2017 11:31 AM

రోజుకో పండు ఆరోగ్యానికి మేలు.. రోజుకో ఆపిల్ తినండి డాక్టర్ అవసరం లేదు.. అని నిత్యం మన పెద్దలు, వైద్యులు చెబుతుంటారు. ఈ కాలంలో అన్నం కంటే.. ఫ్రూట్స్ తిని బతికేస్తున్నవారు ఎందరో. డైలీ లైఫ్‌లో పండ్లు ఎంతో కీలకమయ్యాయి. ఇంట్లో కూరగాయల బడ్జెట్ కంటే.. పండ్లకు పెట్టే ఖర్చు రోజు రోజుకూ పెరుగుతున్నది. మరి అలాంటి ఫ్రూట్స్ క్వాలిటీ విషయంలో చాలా మందికి అవగాహన తక్కువేనని చెప్పవచ్చు. ఏ మాల్‌కు వెళ్లినా.. ఏ సూపర్ మార్కెట్‌లో చూసినా.. రోడ్డు పక్కన బండ్లపైనా అయినా ప్రతి ఫ్రూట్ పై ఒక స్టిక్కర్ కనిపిస్తుంది. ఆ స్టిక్కర్‌పై నంబర్ ఉంటుంది. ఆ స్టిక్కర్‌పై ఉన్న అంకెలు ఏం చెబుతున్నాయి అనేది ఎవరికీ తెలియదు. కొన్నామా.. స్టిక్కర్ తీసేసి తిన్నామా..? వరకే మనం పరిమితమవుతున్నాం. పండ్లపై ఉండే స్టిక్కర్‌పై ఉండే సంఖ్యలలో ఏయే అంకెలు ఏం వివరాలు తెలియజేస్తాయో చూద్దాం..

3 లేదా 4 అంకెతో ప్రారంభమైతే..

పండ్లపై ఉండే స్టిక్కర్లపై నాలుగు అంకెల సిరీస్ ఉండి.. ఆ నంబర్ 3 లేదా 4తో ప్రారంభమైతే ఆ పండ్లు కృత్రిమ రసాయనాలు, రసాయనికి ఎరువులు వాడి పండించారని అర్థం. సాధారణంగా అలాంటి స్టిక్కర్లు ఉన్న పండ్లను 20వ శతాబ్దంలో వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ఆధారంగా, నూతన పద్ధతులను ఉపయోగించి పండించారని గుర్తుంచుకోవాలి.

9 అంకెతో ప్రారంభమైతే...
పండ్లపై వేసే స్టిక్కర్లపై ఐదంకెల సిరీస్ ఉండి.. ఆ నంబర్ 9తో ప్రారంభమైతే ఆ పండ్లను పూర్తిగా సేంద్రియ ఎరువులను ఉపయోగించి.. అత్యంత సహజ సిద్ధమైన పద్ధతిలో పండించారని అర్థం. ఇవి మన శరీరానికి ఎటువంటి హాని చేయవు. పూర్తిగా సురక్షితమైనవి. మంచి క్వాలిటీ ఉన్నవి అని గుర్తుంచుకోవాలి.

8 అంకెతో ప్రారంభమైతే..
పండ్లపై ఉన్న స్టిక్కర్లపై ఐదు అంకెల నంబర్ ఉండి.. ఆ సిరీస్ 8తో ప్రారంభమైతే ఆ పండ్లు జన్యు మార్పిడితో పండించారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి పండ్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇవి ప్రమాదకరమైనవి కూడా అని వైద్యులు సూచిస్తున్నారు. సో.. ఇక నుంచి మీరు పండ్లు కొనుగోలు చేసేటప్పుడు వాటిపై ఉండే స్టిక్కర్లను గమనించి మనకు ఎంతమేరకు ఉపయోగపడతాయో తెలుసుకుని మరీ కొనడం మంచిది.

4842
Tags

More News

VIRAL NEWS