ఈ ఆహారాలను తీసుకుంటే జుట్టు త్వరగా తెల్లబడుతుంది తెలుసా..?


Sun,January 7, 2018 01:09 PM

జుట్టు మొత్తం నల్లని వెంట్రుకలు దట్టంగా ఉండి మధ్యలో ఒక తెల్ల వెంట్రుక కనిపిస్తే ఎవరికైనా మనస్సు చివుక్కుమంటుంది. అప్పుడే నాకు వృద్ధాప్యం వచ్చిందా అని ఇలాంటి వారు కంగారు పడతారు. అయితే వయస్సు మీద పడే కొద్దీ జుట్టు తెల్లబడడం సహజమే అయినప్పటికీ మనం నిత్యం తీసుకునే పలు ఆహారాలు కూడా జుట్టు తెల్లబడేందుకు కారణమవుతుంటాయి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. చక్కెర


చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, ఇతర ఆహారాలను ఎక్కువగా తినేవారికి జుట్టు త్వరగా తెల్లబడుతుంది. వెంట్రుకలు వేగంగా తెల్లగా మారుతాయి. జుట్టు పెరుగుదలకు, నల్లబడేందుకు విటమిన్ ఇ ఎంతగానో అవసరం. అయితే చక్కెర ఎక్కువగా తీసుకుంటే దాంతో శరీరం విటమిన్ ఇ ని గ్రహించలేదు. ఫలితంగా జుట్టు త్వరగా నెరుస్తుంది.

2. ఉప్పు


ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ద్రవాలు నియంత్రణలో ఉండవు. దీనికి తోడు ఆ ప్రభావం జుట్టుపై కూడా పడుతుంది. ఉప్పులో ఉండే సోడియం శరీరంలో ఎక్కువగా చేరితే జుట్టు సమస్యలే కాదు, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. బీపీ పెరుగుతుంది.

3. కూల్ డ్రింక్స్


జుట్టు తెల్లబడేందుకు కూల్ డ్రింక్స్ కూడా ఒక కారణమే. ఎందుకంటే వీటిలో సోడా, చక్కెర ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్లను శరీరం తీసుకోకుండా అడ్డుకుంటాయి. దీంతో జుట్టు త్వరగా తెల్లబడుతుంది.

4. మోనోసోడియం గ్లూటమేట్


మోనోసోడియం గ్లూటమేట్ ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తరచూ ఎక్కువగా తీసుకున్నా వెంట్రుకలు త్వరగా నెరుస్తాయి. ఎందుకంటే ఈ పదార్థం మన శరీర మెటబాలిజం ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. దీంతోపాటు జుట్టు సమస్యలను కలిగిస్తుంది.

12457

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles