ర‌న్నింగ్‌, వాకింగ్‌.. రెండింటిలో ఏది బెట‌ర్‌..?


Thu,August 10, 2017 11:39 AM

ర‌న్నింగ్‌, వాకింగ్‌... ఈ రెండింటిలో ఏది చేసినా దాని వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలే క‌లుగుతాయి. ముఖ్యంగా శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది. ఫ‌లితంగా బ‌రువు తగ్గుతారు. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఇంకా అనేక ఇత‌ర లాభాలు కూడా ఉంటాయి. అయితే ఈ రెండింటి విష‌యంలో చాలా మందికి ఎదురయ్యే ఒకే ఒక సందేహం ఉంది. అదేమిటంటే... అధిక బ‌రువు త‌గ్గేందుకు రన్నింగ్ లేదా వాకింగ్, ఈ రెండింటిలో ఏది బెట‌ర్‌..? అనే సందేహం వ‌స్తుంటుంది. మ‌రి ఈ రెండింటిలో ఏది బెట‌రో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. అధికంగా బ‌రువు లేని వారు ఫిట్ గా ఉన్న‌వారు ర‌న్నింగ్ నిర‌భ్యంత‌రంగా చేయ‌వచ్చు. అయితే అల‌సిపోతున్నామ‌ని భావిస్తే వెంట‌నే ఆ ప‌ని విర‌మించుకోవాలి.

2. బాగా బ‌రువున్నవారు మొద‌ట వాకింగ్‌తో ప్రారంభించి నెమ్మ‌దిగా ర‌న్నింగ్ చేయ‌డం అల‌వాటు చేసుకోవాలి. ముందుగా స్పీడ్ త‌క్కువ‌తో ఆరంభించి క్ర‌మంగా బ‌రువు త‌గ్గుతున్న కొద్దీ స్పీడ్ పెంచాలి. దీంతో బ‌రువు వేగంగా తగ్గుతారు.

3. ఇక పైన చెప్పిన వారు కాకుండా కీళ్ల స‌మ‌స్య‌లు, గుండె సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న వారు వాకింగ్ చేయ‌డ‌మే మంచిది. ఎందుకంటే వారికి ర‌న్నింగ్ చేస్తే అనారోగ్య స‌మ‌స్య‌లు పెరిగే అవ‌కాశం ఉంటుంది.

4. అయితే బ‌రువు స‌రిగ్గా ఉన్న‌వారు, పూర్తి ఆరోగ్య‌వంతులు ర‌న్నింగ్ లేదా వాకింగ్ రెండింటిలో ఏదైనా చేయ‌వ‌చ్చు. త‌మ సౌక‌ర్యానికి అనుగుణంగా ఏది చేసినా అది మంచి ఫ‌లితాల‌నే ఇస్తుంది.

6646

More News

VIRAL NEWS