చల్ల చల్లని గులాబీ షర్బత్.. తాగితే బోలెడన్ని లాభాలు..!


Wed,May 16, 2018 03:38 PM

ఎండలు దంచి కొడుతున్నాయి. కాలు బయట పెట్టాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది వేసవి తాపం నుంచి సేదదీరేందుకు చల్లని పానీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా వేసవిలో పండ్ల రసాలు, నిమ్మరసం, షర్బత్, కూల్ డ్రింక్స్, కొబ్బరినీళ్లను చాలా మంది తాగుతారు. అయితే గులాబీ పూలతో తయారు చేసే రోజ్ షర్బత్ (గులాబ్ షర్బత్) ఒకసారి తాగి చూడండి. దాంతో అనేక లాభాలు కలుగుతాయి.

గులాబ్ షర్బత్ తయారీవిధానం...
బాగా పూసిన పింక్ కలర్ గులాబీ పువ్వు ఒకటి తీసుకుని దాని రెక్కలను వేరుచేయాలి. అనంతరం వాటిని శుభ్రంగా కడగాలి. ఒక పాత్రలో నీటిని తీసుకుని ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు మరిగాక అందులో కడిగి పెట్టుకున్న గులాబీ రెక్కలను వేయాలి. అనంతరం మళ్లీ నీటిని మరిగించాలి. ఈ క్రమంలో పింక్ రంగులో ఉండే గులాబీ రెక్కలు తెల్లగా మారుతాయి. వాటిలో ఉండే సారం అంతా నీటిలోకి దిగుతుంది. అప్పుడు ఆ నీటిని చల్లార్చి వడకట్టాలి. అనంతరం వచ్చే ద్రవంలో కొద్దిగా రోజ్ ఎసెన్స్ కలపాలి. అవసరం అనుకుంటే తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు. తరువాత దాంట్లో తగినంత చక్కెర, చల్లని నీళ్లు పోయాలి. అంతే.. గులాబ్ షర్బత్ రెడీ అయినట్టే.

గులాబ్ షర్బత్ తాగడం వల్ల కలిగే లాభాలివే...


1. గులాబీ పూలలో మన శరీరానికి ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణాలు కూడా గులాబీ పూలలో ఉంటాయి.

2. గులాబీ షర్బత్‌ను తాగితే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరం చల్లగా మారుతుంది. డీహైడ్రేషన్ సమస్య నుంచి బయట పడవచ్చు.

3. ఎండ దెబ్బ తగిలిన వారికి గులాబీ షర్బత్ చక్కని శక్తినిస్తుంది. జ్వరం రాకుండా ఉంటుంది.

4. గులాబీ షర్బత్‌ను తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ ఉండవు. విరేచనం సాఫీగా అవుతుంది.

5. చర్మం, శిరోజాలను సంరక్షించే గుణాలు గులాబీ పూలలో ఉంటాయి. కనుక గులాబ్ షర్బత్‌ను తాగితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా, ముడతలు లేకుండా మారుస్తాయి. శిరోజాలు సంరక్షింపబడతాయి.

3076

More News

VIRAL NEWS