చిన్నపాటి చిట్కాలతో ఒత్తిడి మటుమాయం


Sun,June 10, 2018 07:29 PM

చదువుకునే పిల్లలకు ప్రిపరేషన్ ఒత్తిడి. ఉద్యోగం చేసేవాళ్లకు టార్గెట్ల ఒత్తిడి. వ్యాపారం చేసేవాళ్లకు లాభనష్టాల ఒత్తిడి. ఎవరికి లేదు ఒత్తిడి. కానీ దీని నుంచి బయటపడటం ఎలా? అనే ఆలోచనతో మరింత ఒత్తిడికి గురవుతుంటారు చాలామంది. అలా కాకుండా చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఒత్తిడి మటుమాయం అవుతుందని అంటున్నారు నిపుణులు.

ఒత్తిడితో ఆందోళనకు గురై సమస్యలు కొని తెచ్చుకోవడం కాకుండా ప్రశాంతంగా ఉండాలంటున్నారు అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ (ఎంఎస్‌యూ) పరిశోధకులు. తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులను సుదీర్ఘంగా పరిశీలించారు. వారి ఒత్తిడికి కారణాలను కనుగొన్నారు. ఒత్తిడి అందరిపైనా ఒకే రకమైన ప్రభావం చూపిస్తుందని వారు తెలిపారు. తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు తమ ఫీలింగ్స్‌ను కాగితంపై రాయాలని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆటోమేటిగ్గా ఒత్తిడి దూరమవుతుందట. ఫీలింగ్స్‌ను రాయడం అనేది ఒత్తిడిని డామినేట్ చేయడంతో మనసు కూల్ అవుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలా తమ ఫీలింగ్స్ రాస్తూ ప్రశాంతతను పొందినవాళ్లు తమ పరిశీలనలో అధికంగా ఉన్నట్లు మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. రాయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాదు, క్రియేటివిటీ కూడా బయటపడుతుందంటున్నారు.

6274

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles