సావిత్రిగా మంచు లక్ష్మీ కూతురు..!


Tue,August 8, 2017 03:43 PM

టాలీవుడ్ లో వారసుల హవా ఎక్కువ‌ అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది వారసులు ఉండగా, వారు తమ సొంత టాలెంట్ తో రాణిస్తున్నారు. వారసత్వంగా చైల్డ్ ఆర్టిస్టులుగా కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆ మధ్య మహేష్‌ కుమారుడు గౌతమ్ నేనొక్కడినే చిత్రంతో పరిచయం కాగా, సుధీర్ బాబు తనయుడు చరిత్ మానస్ పలు సినిమాలలో కనిపించాడు. ఇక తాజాగా మంచు వారసురాలు వెండి తెరకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ లు టాలీవుడ్ లో రాణిస్తున్నారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మంచు లక్ష్మీ కూతురు నిర్వాణ టాలీవుడ్ కి డెబ్యూ ఇవ్వ‌నుంద‌ట‌. మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో నిర్వాణ చిన్నప్పటి సావిత్రిగా కనిపించనుందట. చిత్ర నిర్మాత ,అశ్వీనీ దత్ కూతుల్ళు ప్రియాంక స్వప్నలు మంచు లక్ష్మీకి ఫ్రెండ్స్ కాగా, ఆ సత్సంబంధంతో తన కూతురిని నటింపజేయాలని అడిగిందట. దీనికి వారి నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే తెలుస్తుంది.

4441

More News

VIRAL NEWS

Featured Articles