నిద్ర జీవిత కాలాన్ని ప్రభావితం చేస్తుందట !


Thu,June 7, 2018 11:12 PM

కొందరు బస్సుల్లో నిద్రపోతుంటారు. మరికొందరు పని చేస్తూనే నిద్ర పోతుంటారు. ఇంకొందరైతే నిద్ర పోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. చాలామంది ఇలా నామమాత్రంగా నిద్రపోతుంటారు. కానీ అది ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. మీరు ఎన్ని గంటలు, ఎంత సుఖంగా నిద్రపోయారు అనేదాన్నిబట్టి మీ జీవితకాలం ఆధారపడి ఉంటుందట.

మంచి వ్యాయామం చేస్తూ, మంచి జీవన విధానం అలవర్చుకోవడమే కాదు మంచి నిద్ర కూడా ముఖ్యం అంటున్నారు నిపుణులు. నిద్ర జీవిత కాలాన్ని ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. అమెరికన్ జెరియేట్రిక్స్ సొసైటీ ఈ అంశంపై అధ్యయనం చేసింది. 1517 మందిని పరిశీలించారు. 60 సంవత్సరాల లోపు వయసున్న స్త్రీ, పురుషులను పరిశీలించారు. వీరిలో సుఖ నిద్రపోయేవాళ్ల బీఎంఐ, హృదయ స్పందనలు, వ్యాధి నిరోధకత వంటి లక్షణాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. నామ మాత్రంగా నిద్రపోయేవాళ్ల స్థితిని పరిశీలిస్తే ఎన్నోసార్లు హార్ట్ స్ట్రోక్‌లు వచ్చాయని వెల్లడైంది. దీనివల్ల అకాల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలా కాకుండా జీవితానికి భరోసా ఉండాలంటే సుఖనిద్ర పోవాలనీ, ఇది వ్యాయామం కంటే ఎక్కువగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.

8270

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles