మధుమేహం ఉన్నవారు నెయ్యి తినవచ్చా..?


Tue,May 15, 2018 08:03 PM

అవును, తినవచ్చు. మధుమేహం ఉన్నవారు నిర్భయంగా నెయ్యి తినవచ్చు. దాంతో వారికి మేలే జరుగుతుంది. అలా అని మేం చెప్పడం లేదు. వైద్యులే చెబుతున్నారు. అయితే వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి సేవిస్తే మంచిది. లేదంటే బయట దొరికే ఆర్గానిక్ నెయ్యి అయినా వాడవచ్చు. నెయ్యిని మధుమేహం ఉన్నవారు రోజు వాడితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డయాబెటిస్ ఉన్న వారు నెయ్యిని తినవడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహిస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

2. సాధారణంగా మధుమేహం ఉన్నవారిలో జీర్ణ సమస్యలుంటాయి. మలబద్దకం ఉంటుంది. అదే వారు నెయ్యి తింటే జీర్ణ సమస్యలు పోతాయి. విరేచనం సాఫీగా అవుతుంది.

3. నెయ్యిలో సమృద్ధిగా ఉండే లినోలీయిక్ యాసిడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.

4. నెయ్యి తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందని అనుకుంటారు. అది నిజం కాదు. నెయ్యి తింటే శరీరంలో కొవ్వు చేరదు. ఉన్న కొవ్వు కరుగుతుంది. బాగా లావుగా ఉండే టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మేలు చేస్తుంది.

5. రోజూ నెయ్యిని ఆహారంలో భాగం చేసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

6. నెయ్యిలో ఉండే విటమిన్ కె శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. డయాబెటిస్ ఉన్న వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

7. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది.

8. అన్నం, బ్రెడ్, పరోటాలు తదితర ఆహారాల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. దీంతో ఆ ఆహారాలను డయాబెటిస్ ఉన్నవారు తింటే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. అయితే అలా పెరగకుండా ఉండాలంటే మధుమేహం ఉన్నవారు ఆ ఆహారాలలో నెయ్యి కలిపి తినాలి. దీంతో గ్లూకోజ్ లెవల్స్ ఒక్కసారిగా పెరగవు. షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.

5885

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles