వీర్య క‌ణాల సంఖ్య బాగా పెర‌గాలంటే ఏం చేయాలో తెలుసా..?


Sun,September 10, 2017 12:59 PM

నేటి త‌రుణంలో చాలా మంది పురుషులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య వీర్య క‌ణాల లోపం. త‌గిన‌న్ని క‌ణాలు లేక‌పోవ‌డం వ‌ల్ల పిల్ల‌లు క‌ల‌గడం లేదు. దీంతో మాన‌సికంగా కూడా కుంగుబాటుకు లోన‌వుతున్నారు. అయితే మ‌నం కూర‌ల్లో ఎక్కువ‌గా వాడే శ‌న‌గ‌ల‌ను నిత్యం తింటుంటే దాంతో వీర్య క‌ణాల లోపం స‌మస్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గుప్పెడు శ‌న‌గ‌లు, 5 బాదం పప్పును రాత్రి నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున వాటిని తినాలి. అనంత‌రం ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగాలి. ఇలా చేస్తుంటే వీర్య క‌ణాల సంఖ్య బాగా పెరుగుతుంది.

2. రాత్రి పూట ఒక క‌ప్పు శ‌న‌గ‌ల‌ను నాన‌బెట్టి ఉద‌యాన్నే వాటిలో ఒక టీస్పూన్ తేనె క‌లుపుకుని తినాలి. దీంతో స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

3. రాత్రి పూట నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను ఉద‌యాన్నే బెల్లంతో క‌లిపి తినాలి. దీంతో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. వీర్య క‌ణాలు వృద్ధి చెందుతాయి.

4. రాత్రంతా నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను ఉద‌యాన్నే నెయ్యితో వేయించాలి. అనంత‌రం వాటిని తిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగాలి. ఇలా చేస్తూ ఉన్నా వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది.

23519

More News

VIRAL NEWS